Header Banner

మిగిలిపోతున్న తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు! ఏం జరుగుతోంది..!

  Mon May 12, 2025 17:50        Devotional

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఈ సారి వేసవి సెలవుల్లో రద్దీ పెరుగుతుందనే అంచనాలతో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేసారు. బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలను అనుమతించమని వెల్లడించారు. అయితే, టీడీపీ అంచనా లు తప్పుతున్నాయి. వేసవి రద్దీ ఆశించిన స్థాయిలో లేదు. దర్శన క్యూ లైన్లు కొన్ని సందర్భాల్లో ఖాళీగా కనిపిస్తున్నాయి. అనూహ్యంగా వారం రోజులుగా శ్రీవాణి దర్శన టికెట్లు సైతం మిగిలి పోవటం ఆశ్చర్యకరంగా మారుతోంది. తిరుమలలో ఈ సారి వేసవి సెలవుల్లో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవి లో తిరుమల భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ సారి అదే అంచనాలతో టీటీడీ ముందస్తు చర్యలను చేపట్టింది. వీఐపీ లేఖలను రద్దు చేసింది.
ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే బ్రేక్ దర్శనాలను పరిమితం చేసిం ది. అటు ఆపరేషన్ సింధూర్ తో అంచనాలు తారు మారు అయ్యాయి. ప్రతీ వేసవిలోనూ దర్శనా నికి భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు క్యూ లైన్లు కిలో మీటర్ల మేర వ్యాపిస్తాయి. ఈ ఏడాది మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో మే 1 నుంచి 10వ తేదీ వరకు 7,04,760 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, ఈ సారి కూడా అదే సంఖ్యలో 7,04,689 మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

మిగిలిన దర్శన టికెట్లు
సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ లో భక్తులు పోటీ పడి మరీ దక్కించుకుంటారు. నిమిషాల వ్యవధిలో టికెట్లు పూర్తి అవుతాయి. అయితే, తాజాగా తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు భారీగా మిగిలిపోతున్నట్లు తెలుస్తోంది. గడచిన ఆరు రోజుల్లో ఏకంగా 4,113 టికెట్లు మిగిలిపోయాయి. కాగా టీటీడీ రోజుకు 1500 శ్రీవాణి ట్రస్ట్‌ దర్శన టికెట్లు కేటాయిస్తోంది. వేసవి లో శ్రీవాణి టికెట్ల కోసం రద్దీ ఎక్కువగా ఉండేది. ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అదే సమయంలో తిరుమలలో సాధారణ రద్దీ కొనసాగుతుండటంతో దర్శనం సైతం త్వరగానే అందు తోందని భక్తులు చెబుతున్నారు.

యుద్దం ఎఫెక్ట్
అయితే, టీటీడీ వేసవి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినా.. అంచనాలు తప్పాయి. ఈ ఏడాది వేసవి సెలవుల్లో రద్దీ పెరగకుండా సాధారణంగానే ఉండటానికి ఆపరేషన్ సింధూర్.. తదనంతర పరిణామాలే కారణంగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది వేసవికి రద్దీ విపరీతంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ ఉద్రిక్తతల నేపథ్యంలో సాధారణ రద్దీ నెలకొంది. ఈ నెలలో 1, 2 తేదీలు మినహా ఏ రోజూ కంపార్టు మెంట్లు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో కేవలం 7 నుంచి 12 గంటల్లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుమల పర్యటన పూర్తి చేసుకుంటున్నారు. తిరుమల అత్యంత రద్దీతో కూడుకున్న ప్రదేశం కావడంతో చాలా మంది భక్తులు యుద్ధ పరిస్థితి చక్కబడిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లచ్చనే అభిప్రాయంతో తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.


ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Tirumala #TTD #DarshanTickets #SrivariDarshan #TirumalaNews #Devotees #TempleUpdates